పుట:VrukshaSastramu.djvu/452

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

448

రు. ఆకులమట్టలతో చేతికర్రలుచేయుచున్నారు. అరేబియా దేశములో పువ్వుల మట్టల నుండి సుగంధమగు ద్రవముతీయుచున్నారు. ఆదేశస్తులకు కాయలు ఇక్కిలి ఉపయోగమగు ఆహార పదార్థము. మనము కాయలను శుభకార్యములందు నితర పండ్లకు బదులుగా ఉపయోగించు చున్నారు. పండ్లు తినుటకు చాల రుచిగ నుండును. కాని చెట్టున పండిన పండునకు బదులుగ బజారులందు బెల్లపు నీళ్ళలో నానవేసిన దానిని అమ్మతెచ్చెదరు. ఖర్జూరపు చెట్ల నుండి కూడ కల్లు పంచదారయు వచ్చును.

ఈత చెట్లు మన దేశమునందెక్కువగానె పెరుగుచున్నవి. వీనిఆకులు గింజలు ఖర్జూరపు చెట్ల ఆకుల గింజలవలె నుండును. కాని వీని పండ్లలోనంతకండలేదు. ఈత చెట్ల నుండి కల్లు చాల వచ్చును. ఈ కల్లునకు ధరయుచాలగలదు. దీని నుండి కూడ పంచ దార చేయుచున్నారు.

చిట్టీతచెట్లు ఈతచెట్లవలెనే యుండును గాని చాల పొట్టిగా నుండును. దీని పండ్లు కూడ చిన్నవి. ఇవి పండిన తరువాత నీతపండ్ల వలె ఎర్రగ నుండకనల్లగానుండును.