పుట:VrukshaSastramu.djvu/434

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

430

అండకోశము అండాశయ ముచ్చము. 8 గదులు అండముల మధ్యస్తంభ యోగము.

కీలము కింజల్కములు అంత పొడుగు గానుండును. ఫలము కండ కాయ.

ఈ కుటుంబపు మొక్కలు విస్తారము శీతల దేసములందు పెరుగు చున్నవి. వీనిలో నన్నియు చిన్న మొక్కలే కాని రెండు మూడు చెట్లు కూడ కలవు. ఏక దళ బీజపు మొక్కలలో నిట్టి చెట్లుండుట మిక్కిలి అరుదు. ఈ కుటుంబపు మొక్కలలో చాల వానికి ప్రకాండము భూమిలోపల నుండును. ఆకులు ఒంటరి చేరిక, సమాంచలము. సమ రేఖ పత్రములు. పుష్ప భాగములు వలయమునకు మూడో, ఆరో యుండును. అండ కోశము ఉచ్చము ఉల్లి పాయల వాడుక ఇప్పుడెక్కువైనది గనుక వాని పంటయు నెక్కువైనది. మనదేశమునందెల్లయెడలను పైరగు చున్నవి కాని హింధూ స్థానములో ఎక్కువ అచ్చటి పాయలు మిగుల పెద్దవి. నీరుల్లి పాయలలో తెల్లనివి ఎర్రనివి అని రెండు రకములు గలవు. ఎర్రని వాని కంటే తెల్లనివి శ్రేష్ఠమందురు.

పైరు చేయుటకు మళ్ళు గట్టి ఉల్లి పాయల ముక్కలను నామళ్ళలో పాతుదురు. గింజలు చల్లినను మొక్కలు మొలచును గాని గింజలు నిలువ యున్న యడల బురుగు పట్టును. మరియు