పుట:VrukshaSastramu.djvu/400

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

396

కును పవిత్రమనదే. ఇదియువేపచెట్టును దగ్గర దగ్గరగా మొలచుచో వీని రెండింటికిని వివాహము చేయుచున్నారు. రావి చెట్టు నుండి పాలు వచ్చి చిక్కబడి ఒక గట్టి పదార్థమగును. ఈ చెట్టు నుండి జిగురు కూడ వచ్చు చున్నది. ఈ జిగురును గుల్ల నగల లోపల బెట్టు చుందురు. దీని బెరడు నుండి తీసిన నారతో కొన్ని చోట్ల కాగితములను చేయు చున్నారు. ఇది తోళ్ళు బాగు చేయుటలో కూడ పనికి వచ్చును. నీళ్ళలో వేసి మరుగ నిచ్చిన యెడల నీటికి కొంచె మెరుపు రంగు వచ్చును. వేరును పటిక నీళ్ళలో కాచిన యెడల ఒకవిధమగు ఊదారంగు వచ్చును. కలప పొయ్యి లోనికి మాత్రము పనికి వచ్చు చున్నది. దీని ఆకులు, కాయలు, బెరడు కూడ ఔషధములో వాడు చున్నారు.

అత్తి చెట్టు ఎత్తుగానె పెరుగును గాని మాను వంకర టింకరగా నుండును. వర్షాకాలములో దీని ఆకులు రాలి పోవును. దీని పచ్చికాయలను పండ్లను కూడ తిందురు. దీని నుండి వచ్చు జిగురును పిట్టలను పట్టుకొనుటకు ఉపయోగించెదరు. కలప పొయిలోనికిని నూతి చట్రములకును బనికి వచ్చును.

రబ్బరు చెట్లనుండియే వచ్చును. చెట్లలోనున్నపాలు చిక్కబడి, పరిశుద్ధము చేయబడిన అదిరబ్బరగును. పాలనుం