Jump to content

పుట:VrukshaSastramu.djvu/401

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

397

డి రబ్బరు వంటివే మరి రెండు పదార్థములు కూడ వచ్చును. ఈ పాలు ఒక జాతి చెట్లలోనే కాక చాల వానిలో గలవు. ఆముదము, గన్నేరు, జిల్లేదు పనస కుటుంబములలో పాలున్న మొక్కలనుండి రబ్బరు తియ వచ్చును.

పనస కుటుంబములో విస్తారము రబ్బరు నిచ్చెడు ఒక చెట్టుగలదు. దీనికి తెలుగు పేరేమియు దొరకలేదు గావున దీనినే రబ్బరు చెట్టు అందము.

రబ్బరు చెట్టును మఱ్ఱి చెట్టువలె పెద్ద వృక్షము. దీనికిని ఊడలు దిగును. ఆకులు అండాకారముగానైనను, నిడివి చౌక పాకారముగానైనను నుండును. దీని పండ్లను పక్షులు తిని చెట్లమీదనే రెట్ట వేయుటచే గింజలు చెట్ల మీదనే మొలచు చున్నవి. అవి పెద్దవై ఊడలు భూమిలో నాటుకొనిన తరువాత అది దేని పై పెరుగెనో ఆ చెట్టు చచ్చి పోవుచున్నది..

ఈ చెట్లను పైరు చేయుటకు వేసవి కాలమందు కాసిన కాయల గింజలు మంచివి. విత్తనములకై కాయలను బాగుచేసి, అవి పాడు కాకుండ బొగ్గు పొడితో కలిపి ఎండ పెట్టుదురు. వర్షాకాలములో కాయలను జిదిపి ఆముక్కలను మళ్ళలో జల్లుదురు. సుమారు మూడు నెలలలో మొలకెత్తును.