పుట:VrukshaSastramu.djvu/399

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

395

ళ్ళలో గలపి వడకట్టి అందులో, పాలు, పంచదార, ఏలక పొడి మొదలగునవి వేసి పుచ్చు కొందురు. దీనిని మితముగ బుచ్చుకొనిన యెడల అంత హాని వాటిల్లదు.

గంజాయి నందరును సేద్యము సేయకూడదు. చేయుటకు గవర్నమెంటు వారి అనుమతి పొందవలయును. దీని అమ్మకమువల్ల చాల రాబడి గలదు.

మఱ్ఱి చెట్ల నుండి రెండవరకము రబ్బరు వచ్చును. గాని మంచి రకము రాదు. మఱ్ఱిపాలను నొప్పులకు కీళ్ళ నొప్పులకు నుపయోగింతురు. ఆకులను గూడ కాచి పట్టు వేయుదురు. బెరడు కషాయము అతి మూత్ర జబ్బునకు మంచినదనుచున్నారు. దీని కలప పొయిలోనికి తప్ప మరెందుకు పనికి రాదు. జాగ్రత్తగ కోసి తగు కాలము నీళ్ళలో నాననిచ్చి ఎండనిచ్చిన యెడల దీని తోడను పెట్టెలు, తలుపులు చేయ వచ్చును. దీని ఊడలను పెద్ద వనిని చెక్కిన డేరామేకులుగ బనికి వచ్చును. లక్క పురుగు దీని ఆకులను దిని బ్రతుగ గలదు. పశువులను ఏనుగులును లేత కొమ్మలను ఆకులను దినును.

రావి చెట్టు కూడ చాల పెద్ద చెట్టు. పక్షులు దీని కాయలను దిని ఇతర చెట్ల మీద దీని గింజలను బడవైచుటచే వాని మీద మొకలెత్తు చుండును. ఈ చెట్లు మనకును బౌద్దుల