పుట:VrukshaSastramu.djvu/398

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

394

మొగమొక్కలు త్వరగ పెద్దవగునుగావున ఆడమొక్కలెదుగు వరకు నుండనిచ్చిన వాని నార పాడగును.

గంజాయిగింజలను కొందరుతిందురు. వీని యందును మత్తు గలుగజేయు గుణము గలదు. ఈ గింజలను నూనె తీసిన తరువాత తెలక పిండిగ పశువులకు బెట్టుట మంచిదందురు.

అంగళ్ళ యందు భంగు అని అమ్మునది ఎండిన గంజాయి ఆకుల పొడి. గంజాయి కొరకే ఈ మొక్కలను సేద్యము చేసినప్పుడు విత్తనములను మొదట మళ్ళలో జల్లి కొంచమెత్తు ఎదిగిన తరువాత, పెంట వేసి దున్నిన పొలములో మొక్కలను నాటి వేయుదురు. అవి పుష్పింప బోవు చుండగనే మగ మొక్కలను బెరికి వేయుదురు. వీనిని బెరికి వేయుటచే పుప్పొడి లేక, ఆడ మొక్కలు కాయలు గాయవు. లేత కొమ్మల మీద నున్న రోమముల ద్వారా నొక రసము స్రవించి చిన్నబడును. ఈ మొక్కల మీదనున్న ముదురాకులను కూడ త్రుంపి వైచి మొక్కలు కోసి కట్టలు గట్టి కాలి క్రింద పెట్టి త్రొక్కుదురు. దానిచే లేతాకులు, పువ్వులు మొగ్గలు కలిసి ముద్దవలె నగును.

గంజాయి ఆకును చిలుములలో పెట్టి హుక్కా పొగాకు మొదలగువాని త్రాగునట్లే త్రాగెదరు. భంగును వేడినీ