పుట:VrukshaSastramu.djvu/366

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

362

ఆడుకంకి కింజల్కములు
- కొన్ని పుష్పములందు మాత్రము రెండు కింజల్కములున్నవి. కొన్నిటి యందు పుప్పొడి తిత్తులు లేక గొడ్డులైనవి యున్నవి. కీలము లేదు. కీలాగ్రములు మూడు. కండ కాయ.

ఈ కుటుంబమునందు గుల్మములును గుబురు మొక్కలును గలవు. ఆకులు ఒంటరి చేరికగానైనను, అభిముఖ చేరికగానైనను, కిరణ ప్రసరముగ నైననుండును. కొన్నిటికి గణుపు పుచ్చములు గలవు. సమాంచలము పుష్పములు చిన్నవి. మిధున పుష్పములు ఏక లింగ పుష్పములును గలవు. పుష్ప కోశము గాని దళవలయము గాని లేదు. కింజల్కములు రెండు మొదలు ఆరు వరకు నుండును. మూడు గాన్, అంతకు ఎక్కువగాని స్త్రీ పత్రములుండును. కొన్నిటిలో నవి కలసి యున్నవి. కొన్నిటిలో విడివిడిగానఏ యున్నవి.

మిరియములు మలబారు దేశమునందే ఎక్కువగా పండు చున్నవి. కొమ్మలను నాటియే పైరు చేయుదురు. తీగెలు ప్రాకుటకు గురుకుగానుండు బెరడు గల చెట్లను పాతుట మంచిది. తరుచుగా పనస చెట్లను పాతి వానిపై తీగెలు ప్రాకింతురు. ఈ తీగెలకు నీరు విస్థారమక్కర లేదు. మూడేండ్లకు కాయలు కాయ నారంబించును. ఏడేండ్లవరకు బాగుగ కాయును. తరువాత క్రమక్రమముగా తగ్గి పోవును. కా