పుట:VrukshaSastramu.djvu/347

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

343

గుమ్మడిచెట్టు కలప కూడ మంచిదియె. టేకు తరువాత దీనినే చెప్పవలెను. ఇదియు నీళ్ళలో చీకి పోకుండ చాల కాలముండును. దీనిని ఓడలకు పడవలకు ఉపయోగింప వచ్చును.

చిన్నగుమ్మడి సాధారణముగ అన్ని బీడు నేలలందు పెరుగ గలదు. దీనికి ఆకుల వద్ద ముండ్లు గలవు. పువ్వులు పెద్దవి. పచ్చగా నుండును. ఇది వంట చెరుకుగా అతప్ప మరెందులకు పనికి రాదు. చిరుగుమ్మడి అడవులలో నుండును. పై దాని వలెనే యుండును గాని యంతకంటె చిన్నది. అకులు చిన్నవియొ. దీని కెక్కువ ముండ్లు గలవు.

ఆకులను నీళ్ళలో నాన వేసినచో అవి చిక్కబడును. వీనిని మూత్ర వ్యాధులకు ఉపయోగింతురు. కలప వంట చెరుగుగా ఉపయోగించు చున్నారు.

పెద్దనెల్లికూర చిన్న చెట్టు. కొమ్మలు వ్యాపించియుండును. దీని పువ్వులు పచ్చగా నుండును. ఆకులను కొందరు కూర వండుకొనెదరు. కలప తెల్లగా నుండును. దీనిని చాల పనులకు ఉపయోగించు చున్నారు.

నౌరు చెట్టు కొండలమీద బెరుగును. దీని ఆకుల అడుగున తెల్లని రోమములు గలవు. పువ్వులుచిన్నవి ఆకు పచ్చగాను, పశుపు పచ్చగను వుండును.