పుట:VrukshaSastramu.djvu/326

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్కలును చిన్న చిన్న పురుగులగును బట్టితినగలవు. వరి చేలలో గూడ నిట్టి మొక్కలు మొలచు చున్నవి. దీని ఆకులు మిక్కిలి చిన్నవి. పువ్వులు నీలముగాను అందముగాను నుండును. కొన్ని మొక్కలు కొంచెము పెద్దవిగా నెదిగి నపుడు తీగెలవలె చుట్టుకొనును. ఈ మొక్కలను దీసి, మన్ను కడిగివేసి చూచిన యెడల చిన్న చిన్న బంతుల వంటివి కనబడును. వాని మీద నొక చోట ఒక రంధ్రమును దాని వద్ద నొక తలుపును గలవు. ఆ అతలుపు లోపలి వైపునకు బోవును గాని పైవైపునకు రాదు. ఈ రంధ్రము చుట్టు కొన్ని రోమములు గలవు. ఏవైన చిన్న పురుగులు తలుపు తోసికొని అతిత్తులలో ప్రవేసించును గాని పైకి రాలేవు. కొన్ని దినములకవి యచ్చట చచ్చి పోవును. వాని రసమును మొక్క పీల్ల్చుకొనుచున్నది. దీని పువ్వులు ఓష్టాకారముగ నున్నవి. కింజల్కములు రెండు అండాశయము ఒక గది.

మరికొన్ని కుటుంబములలోను, కీటకములను దినెడు మొక్కలు గలవు. అవి సాధారణముగ నీటి యొడ్డున బురద నేలలో మొలచు చుండును. ఒక మొక్క ఆకులు సన్నముగా నుండు ను. దాని మీద ఎన్నో రోమములు గలవు. ఆ రోమములలో నుండి ద్రావకము గలిగిన యొక జిగురు రసము వచ్చును. ఏదైన ఒక పురుగు ఆయాకు మీదకు వచ్చిన ఆరోమముల న్నియు దానిపై వంగి అచ్చట దానిని బంధించును. వాని నుండి మరి కొంత ద్రవము స్రవించును. అదితగిలి పురు చచ్చిపోవును.