పుట:VrukshaSastramu.djvu/321

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

317

పెన్నేరు
చిన్నగుబురుమొక్క. ఇది మొరక నేలల మీద పలు తావులందు పెరుగు చున్నది. పువ్వులు చిన్నవి. ఆకు పచ్చగా నుండును. దీని ఆకులను, వేరులను ఔషధౌలలో ఉపయోగింతురు. కాని అంగళ్ళ యందు నితర దుంపలకు పెన్నేరు దుంపలని అమ్ముదురు. మట్ట పాల దుంపయు కొంచెము పన్నేరు దుంపను పోలి యుండును.
పొగాకు
పోర్చు గీసు వారె మన దేశము లోనికి గొని వచ్చిరి. అది హిదూస్థానము కంటె దక్షిణ దేశములో త్వరగా వ్యాపించెను. అక్బరు చక్ర వర్తి కాలము నాటికి నింకనిది అపురూపముగనే యుండెను. ఆ చక్ర వర్తి ఒక నాడు పొగాకు చుట్టను కాల్వ మనసు పడ గొలుపులో నున్న వైద్యులు వారించిరట. తరువాత ఏకారణముననో అతి శీఘ్రముగ నా వాడుక వ్యాపించినది. జహంగీరు పొగాకు చుట్టలు కాల్ల్చుటను తగ్గించుటకు ప్రయత్నించెను. ఇపుడన్ని చోట్లను అనేకులు చుట్టలు గాల్చు చున్నారు. స్త్రీలును కొందరు వానినుపయోగించు చున్నారు.

పొగాకులో పలు తెగలును పెక్కు రకములును గలవు. కొన్ని రకములు చుట్టలకే బాగుండును. కొన్ని పొడుమునకు బాగుండును.