పుట:VrukshaSastramu.djvu/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

316

బంగాళదుంపలు
అమెరికాదేశమునుండి మన దేశమునకు తేబడినవే. మహమ్మదీయ చక్ర వర్తుల కాలములో అపురూపముగ తోటలందు బెంచు చుండెడి వారు. అవి మన దేశములో ఎక్కువగా బైరగుచున్న కొంత కాలమునకు గాని మనము వాని ఉపయోగింప నారంభింప లేదు. మనకు పూర్వమే మహామ్మ దీయులు వాడుచు వచ్చిరి. బంగాళా దుంప మొక్క కొమ్మలే భూమిలోనికి పోయు దుప లగును. వాని మీద గుంటలు గుంటలు వలెను కన్నులు వలెను నుండునవి మొగ్గలుండు తావులు. అట్టిది యొకటుండిన ముక్కను గోసి పాతినచో మొక్క మొలచును. వానినిట్లే పైరు చేయుదురు. ఇప్పుడు మన దేశములోను బలు తావులందు దానిని పండించు చున్నారు. ఈ మొక్కలకు తేమ నేలలు కావలయును. కాని నీరు నిలువ యుండరాదు. పొలములో పేడను ఆముదపు తెలక పిండిని ఎరువుగా వేసి దున్ని దుంప ముక్కలను నాగటి చాళ్ళ గట్ల మీద అడుగడుగు దూరమున పాతుదురు. తరువాత అప్పుడప్పుడీ మొక్కలకు నీరు పెట్టు చుండవలెను. ఎకరము నేలలో వేయుటకు ఖర్చు సుమారు రూ: 170 అగును గాని దాదాపు రెండు వందల నిరువది రూపాయల వరకు వచ్చును. ఈ పంట అయిన పిదప తిరిగి వీనినే బండించుకంటే మరియొక పైరు చల్లుటమంచిది.