పుట:VrukshaSastramu.djvu/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

295

బొమ్మ
పుష్పము చీలిక.

గన్నేరు పువ్వులందముగా నుండును గాన తోటలలో పెంచు చున్నారు. కొన్ని మొక్కల పువ్వులెర్రగాను, మరి కొన్నిటివి తెల్లగాను వుండును. వేరొక కొన్నిటి యందు రేకు లెక్కువగా నుండును. వీని ఆకులు సన్నముగాను, మరి కొన్నిటి యందు రేకు లెక్కువగా నుండును. వీని ఆకులు సన్నముగాను, దట్టముగాను నుండును గాన నీరంతగా లేకున్నను పెరుగ గలవు.

బిళ్ళగన్నేరు చిన్నమొక్క. ప్రతిచోట పెరుగు చున్నది. కొమ్మలు భూమి నంటు చుండెనా యవి వేళ్ళు బారును. వీనిలోను కొన్నిటి పువ్వు లెర్రగాను, కొన్నిటివి తెల్లగాను వుండును.