ఈ పుట ఆమోదించబడ్డది
296
పచ్చగన్నెరు పెద్దగుబురుమొక్క. దీని ఆకులు గన్నేరు అకుల వలెనే వుండును గాని అంతకంటే పలుచగాను మృధువు గాను వున్నవి. దీని యందు తెల్లని బాలు గలవు. పువ్వులు పచ్చగాను గరాటి వలె ఉండును.
అడవిపాలతీగ డొంకల మీదను పొదల మీదను వుండును. వర్షాకాలమందిది పచ్చని పూవులు పూయుము.
మాలతీ లత విస్తారముగ కొండ ప్రదేశములదు పెరుగును. లేత ఆకులు, తొడిమలు, ఈనెలు కొంచెమెర్రగా వుండును. పువ్వులు తెలుపు. కాని మిక్కిలి మనోహరముగ వుండును. పువ్వులు తెలుపు. కాని ఇక్కిలి మనోహరమగు సువాసన గలదు. దీనిని పుష్పములకై తోట లందు పెంచెదరు.
వలతీగ డొంకల మీద పెరుగును. దీని పుష్పములు అందముగా నుండును గాని సువాసనంతగా లేదు.
- దేవ గన్నేరు
- - ముఖ్యముగా దేవుడు గుడుల్లో పెంచెదరు. కొమ్మల చివర ఆకులు కొంచెము గుబురుగా నుండును. అది, పైన కొంచెమెరుపు జీరలును అది, పైన కొంచెము మెరుపు జీరలును లోపల బంగారు వన్నె గలిగిన తెల్లని పెద్ద పువ్వులను పూయును. పుష్పములకు మంచి వాసన గలదు.