పుట:VrukshaSastramu.djvu/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

252

ఇంగువ దానివేరులోనుండివచ్చును. తల్లి వేరు పైనున్న మన్నును ఒత్తి గించి దాని మొదట ఒక నాటు పెట్టుదురు. ఆనాటులోనికి ద్రవము వచ్చి చేరి చిక్క బడును. చిక్కబడిన పిదప దానిని కొంచెము వేరుముక్క తోడనే కోసి, తోలు సంచులలో పెట్టుదురు. అట్లు వేరులోనున్న పదార్థమంతయు వచ్చు వరకు కోయుదురు. ఇంగువలో కల్తి చాల గలుపు చున్నారు. ఆవేరు ముక్కలను బంగాళ దుంప ముక్కలను, తుమ్మజిగురును, మన్నును కూడ కలుపు చున్నారు.

ఇంగువను ఔషధములలో వాడుదురు. పోపులలో వేసి కొందుము. వేడి చేయుటకై బాలింత రాండ్రకు ఇత్తురు. దాని ననుదినము చొంచెము దినుచు వచ్చు చుండుట చేత మన్యపు జ్వరము రాదందురు.

వాము మనదేశమునందంతటను పైరగు చున్నది. దానికి ఎరువులంతగా అవసరము లేదు కాని నీరు చాల కావలయును. కాయలను బట్టి పట్టి చమురు దీయుదురు. చమురు పైన తెల్లగ ఉప్పు వంటి దొకటి చేరును. దానిని దీసి, పువ్వు అని అంగళ్ళ యందు అమ్ముదురు. దానిని నీళ్ళలో గలిపిన ఘాటుగనే యుండును. వామును కొన్నిపిండివంటలయందును, కూర గాయలందును ఔషధములలో కూడ వాడుదురు.