పుట:VrukshaSastramu.djvu/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

236

పుష్ప కోశము
- సంయుక్తము. 4 తమ్మెలున్నవి. నీచము.
దళ వలయము
- అసంయుక్తము. 4 ఆకర్షణ పత్రములు. ఇవి ముడతలు ముడతలుగా నుండును. పుష్పకోశము యొక్క గొట్టము చివరనంటి యుండును. దీనికి సువాసన గలదు.
కింజల్కములు
- ఎనిమిది. రెండు రెండు దగ్గిరగానున్నవి. ఈ రెండును రెండు ఆకర్షణ పత్రములకు మధ్యగా నుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు.
అండ కోశము
- అండాసయముచ్చము. 4 గదులు స్థంభ సంయోగము. కీలము ఒకటి. కాయ ఎండిపగులును.

ఈ కుటుంబములో చెట్లు గుబురు మొక్కలు. చిన్న మొక్కలు కూడ కలవు. ఆకులు అభిముఖ చేరిక. చిన్న కణుపు పుచ్చము లుండును. పుష్ప మంజరులు మధ్యారంభ మంజరులు. ఆకర్షణ పత్రములు నాలుగైన, ఆర్థన నుండును. వానికి పాదము గలదు. కింజల్కములు ఆకర్షణ పత్రములన్నియైన, వానికి రెట్టింపైన, మిక్కిలి ఎక్కువగానైన నుండును. కాడలు పొడుగుగానే యుండును. అండాశయము ఉచ్చము గింజలు చాల గలవు.

గోరింటి చెట్లను వాని ఆకుల నుండి వచ్చు రంగు కొరకు పైరు చేయు చున్నారు. పొలములను బాగుగ దున్ని, ఎరువు వేసి, 25 దినములు విత్తనములు నీళ్ళలో నానిన పిద