Jump to content

పుట:VrukshaSastramu.djvu/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

237

ప జల్లెల్దరు. విత్తనములు జల్లుటకు ముండు మూడు నాలుగు దినములనుండి మళ్ళలో నీరు బెట్టుదురు. నీరుండగానే గింజలను జల్ల వలెను. నీరింక గానె గింజలు భూమి లోనికి దిగును. తరువాత మూడు దినముల వరకు ప్రొద్దుట, సాయంత్రము నీరు పెట్టవలెను. మొక్కలు మొలచిన తరువాత దినము విడచి దినము నీరు బెట్టిన చాలును. రెండడుగు లెత్తు పెరిగిన తరువాత వానిని దీసి దూరము దూరముగ పాతవలెను. రెండవ యేడు నుండియు ఆకులు కోయుట ఆరంభింతురు. కొమ్మల చివర తొమ్మిదంగుళములను గోయుచుందురు. ఎకరము నేల నుండి ఇరువది మణుగులు ఎండాకులు వచ్చును.

ఆకులను ఎండ బెట్టి కొంచెము నూనె గలిపి పొడుము చేయుదురు. ఈ పొడుముతో అప్పుడప్పుడు బట్టలకు రంగు వేయుదురు. ఈ పొడుమును చిరకాలము నుండియు మహమ్మదీయ స్త్రీలు తలకు రాచు కొను చున్నారు. దీని చే వెండ్రుకలు ఎర్రబడును. తరువాత నీలి రంగు బూసిన మిక్కిలి నల్లగా నగురు. జుట్టు నొక్కు నొక్కులుగా గూడనగును.

పచ్చిఆకును రుబ్బి చిన్న పిల్లలు గోళ్ళకు పెట్టుకొందురు. పువ్వులను పరిమళ ద్రవ్యములు చేయుటలో వాడుదురు.