పుట:VrukshaSastramu.djvu/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పైకెదిగెడు ప్రకాండములు కొన్ని ఏదైన నాధారముండిన గాని పోలేవు. చిక్కుడు మొదల్గు తీగెలలో ప్రకాండ మేపందిరినో చెట్టునో జుట్టుకొని ఎగ బ్రాకును. ఇట్లు బ్రాకునవి తిరుగెడు తీగలు, గుమ్మడి, బీర, పొట్లతీగె

తిరుగుడు తీగెలు.

లిట్లు చుట్టుకొనవు. వానికి నులి తీగలు గలవు. ఇవి దేనినైన గట్టిగ జుట్టుకొని ప్రకాండమును పైకి లాగును. మిరియాల తీగె వేరు మూలమున నెగబ్రాకు చున్నది. గచ్చ పొద, ఆరు దొండ ముళ్ళ మూలమున పైకి బోవు చిన్నవి. కొన్ని నులి తీగెలు ప్రకాడము యొక్క మార్పులే. నల్లేరు ద్రాక్ష తీగలలో కాడకొక ప్రక్కను ఆకును, దాని కెదురుగ నొక నులి తీగయు గలవు. ఈనులితీగయె నిజమైన ప్రకాండము దీనిమీ