పుట:VrukshaSastramu.djvu/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నల్లగిరిగిలిగిచ్చ:- బయళ్ళమీద విరివిగా మొలచును. కొమ్మలు భూమివద్ద నుండియు వ్యాపించి యుండును. పువ్వులు సంవత్సరము పొడుగున వికసించును. కాయలు నలుపు.

పెద్ద గిలిగిచ్చ:- ఆరడుగుల వరకుకూడ పెరుగును. చిట్టిఆకులు మూడేసి కలవు. అధశ్చిరయండాకారము. పువ్వులు కొమ్మల చివర నుండును.

కూనగిలిగిచ్చ
- పువ్వులుచిన్నవి. పువ్వులు కణుపు సందుల నుండి వచ్చును.

నాగ గిలిగిచ్చ:- నేలమీద ప్రాకును. చిట్టిఆకులు. అధశ్చిర హృదయాకారము. తొడిమలు ఆకుల యంత పొడగుగా నుండును.

కాయలు బఠాణీ కాయల వలె నుండును.

నీరు గిలిగిచ్చ:- వరిసేలలో మూడునాలు గడుగులెత్తు పెరిగి వర్షాకాలమందు పుష్పించును. చిట్టియాకులకు దొడిమలేదు.

గచ్చ పొద:- సముద్రతీరముల నిసుక నేలల విస్తారముగ బెరుగును. మనము గచ్చకాయలనునవి నిజముగా