పుట:VrukshaSastramu.djvu/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుపయోగించుచున్నారు. అది నీరుపీల్చుకొని యుబ్బును గాన శస్త్ర వైధ్యము నందును, దుద్దులు మొదలగు ఆభరణములు పెట్టుకొనుటకు చెవులకుట్లు పెద్దవి చేయుటకు ఉపయోగించు చున్నారు.

ఎర్రజీలుగు:- మొక్కలు చాలాచోట్ల బెరుగు చున్నవి. వీని నుండి నార తీసి వలలు అల్లుటలో ఉపయోగించు చున్నారు. దీని నారను జనపనారవలెనే తీయుదురు.

దీనితో దమ్ము చేసిన పొలమునకు బలమువచ్చును.

నల్లజీలుగ:- యొక తీగె. చిట్టిఆకులు. మిక్కిలు చిన్నవి. ఆకులపై రోమములు గలవు. ఒక్కొక్క పువ్వుల గెలలో రెండో మోడో పువ్వులుండును.

కొండ గిలిగిచ్చ:- ఆకులు బల్లెపాకారము. పచ్చని పువ్వులు పూయును.

నల్ల గిలిగిచ్చ.- అంతగా మొలవదు. ఆకులు అండాకారము. పువ్వుల గెలలు ఆకులు కెదురుగా నుండును. పచ్చని పువ్వులు సాయంత్రము వికసించును. పువ్వులు చిక్కుడు పువ్వులఆకారము. రెండు రేకుల మీద నల్లని చుక్కలు కలవు.