పుట:VrukshaSastramu.djvu/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరిని గాలిని ప్రసరింప చేయుదురు. పిదప ద్రవమును తేలనీయ నీలి రంగడుగునకు బోయి పైన నెర్రని నీరు మిగులును. ఈ నీరంతయు బార పోసి మడ్డివలె నున్న రంగును దీసి పరిశుభ్రమగు నీళ్ళతో గలిపి కాచవలెను. బాగుగ మరిగిన పిమ్మట వెదురు బద్దల మీద బరచి యున్న కేన్వాసు. గుడ్డ మీద నార బోయుట చే నీరంతయు ఇంకి రంగు నిలుచును. దీని నటు పిమ్మట జతురముగా నున్న బెట్టెలలో వేసెదరు. ఆ పెట్టెల మూతలు కొంచెమైన ఎడము లేకుండ సరిగ పట్టును. వాని మీదను కొన్ని రంధ్రములు మాత్రము గలవు. అయిదారు గంటలకొక మాటు చొప్పున మూతలను నొక్కెదరు. నీరేమైన నున్న యెడల ఆ రంద్రములలో నుండి పోయి రంగు గట్టిపడును. గట్టి పడిన దానిని మూడేసి యంగుళముల ముక్కలుగా గోసి ఒక గదిలో నారబెట్టెదరు. గాలి విస్తారముగా జొచ్చుచున్నయెడల ముక్కలు పగిలి పోవును గాన తగినంతయే గది లోనికి వచ్చు నట్లు జూచుచుండ వలెను.

యంత్రములు లేని చోట్ల రొట్టనెండ బెట్టి కర్రలతో బాది ఆకులను రాల గొట్టెదరు. వీనిని నీళ్ళలో నానవేసి పెద్ద పెనములలో ఆ రసమును కాచెదరు. అడుగున