పుట:VrukshaSastramu.djvu/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

కనరు
....చెట్టు గుబురు మొక్క. దీనిమీద ముండ్లుగలవు. ఆకులు నిడివి చౌక పాకారము.
పెద్దకనరు
.... పైదానంత విరివిగా బెరుగుట లేదు. దీని ఆకులు అండాకారముగ నున్నవి.

పావలి కుటుంబము.


ఈ కుటుంబము చిన్నది. దీనిలో జేరు మొక్కలన్నియు గుల్మములే. పెద్దచెట్లు లేవు. ఆకులు, సమాంచలము. అభిముఖ చేరికగా నైనను, ఒంటరి చేరికగానైనను నుండును. కణుపుల వద్ద రోమముల వంటివి గలవు. రక్షక పత్రములు రెండు. అవి మొగ్గలో అల్లుకొని యుండును. ఆకర్షణ పత్రములు నాలుగో, అయిదో గలవు. కొన్నిటిలో నడుగున నివన్నియు గలసి యున్నవి. దళవలయము కొన్నిటిలో వృతాశ్రితముగను, గొన్నిటిలో బుష్ప కోశాశ్రితముగ గూడ నున్నది. కింజల్కములు నాలుగు గాని అంత కంటె నెక్కువవ గాని యుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు అండాశయము ఒక గది అండములు రెండో, ఇంక నెక్కువయో యుండును. కీలము చివరి రెండుమొదలు ఎనిమిది చీలికల వరకు గలవు. ఈ చీలికలు కీలాగ్రముల వలెనే నుండును.