ఈ పుట ఆమోదించబడ్డది
95
రిక, కొన్నిటి పువ్వులు మిధునపుష్పములు. కొన్నిటిలో నేకలింగ పుష్పములును గలవు. తరచు నీపువ్వులకు ఆకర్షణ పత్రములుండవు. కింజల్కములు చాల గలవు. విత్తనములలో అంకురచ్చదనము గలదు.
- నీరదచెట్లు
- ... దక్షిన హిందూ దేశమునందును మలబారు నందును విరివిగా నున్నవి. దీని గింజలు ముప్పాతిక అంగుళం పొడగు, అరంగుళము వెడల్పు ఉండును. ఈ గింజలనుండి తీసిన చమురును చర్మవ్యాధులను బోగొట్టుటకును ఇతర జబ్బులకును వాడుదురు.
- కురంగ వాము
- .... చెట్టు గుబురు మొక్క. దీనిలో రెండు రకములు గలవు. ఒకటి తెల్లని పువ్వులను రెండవది కొంచ మెర్రని పువ్వులను బూయును. ఈ రెండవ రకము చట్టే మంచిది. దీనినే తరచుగా బెంచెదరు. దీని కాయలనుండి, గింజలనుండి ఎర్రరిని రంగువచ్చును. ఈ రంగుతో పట్టు బట్టలకు రంగు వేయుదురు. కాయలను ఉడక బెట్టి, గింజలచుట్టునుండి కండ దీసి దానిని నుపయోగించెదరు.
దీని గింజలు, వేరు బెరడును ఔషధములలో కూడ వాడుదురు. వేరు, బెరడు జ్వరములకు పని చేయును. గింజల కషాయము శగ రోగముల కిత్తురు.