పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

53


రెడ్డి గారు కరీంనగరు వచ్చిరి. తాలూకాకు ఇంటి తాళము భద్రముగా యున్నది. తలుపులన్నియు అట్లే మూతపడి యున్నవి. ఇంటి వెనుక భాగములో ఒక తలుపు మాత్రము తెరువబడినది. కాని తలుపు పగులగొట్టబడ లేదు. ఎందును రం ధ్రములు లేవు. “లోపలి చిలుకు ఎట్లు వదలిపోయెను." అని వీరాందోళన పడుచుండిరి. వీరి కుమారులగు రంగా రెడ్డి గారును లక్ష్మారెడ్డిగారును చిన్న బాలురు. వారుతము తండ్రి గారిఆందోళనమును చూచి అమాయిక ముగా సిట్లనిరి. " దిడ్డి తలు పును బయటి నుండి తిన్నగా చరిచుచు వచ్చిన లోపలి చిలుకు జారిపడను. బేగంగారి వద్దకు వారి సంబంధికుడు అదే విధముగా ఆతలుపును తెరచి మమ్ము అప్పుడప్పుడు తీసికొని పోవుచుండెను. ఈ మాటలవలన రెండు సంగతులు తెలియ వచ్చెను తలుపు తెరచు మార్గమేకాక, తలుపు తెరిచిన వాడు తాలూక్లారి గారి సంబంధీకుడే అని విశదమయ్యెను. ఇంటిలోపల ప్రవేశించి చూడగా మెట్లవద్ద మట్టినేల పై కాలిజాషలు కనిపించెను. అందొక కాలి వ్రేలు మడతపడినదిగా కనుపించెను. అనుమానింపబడిన వానికి ఒక కాలి వ్రేలు మడతపడినదిగా నుండెను. వానిని కొన్ని దినముల క్రిందటనే తాలూక్గారు పంపి వేసియుండెను. అతడెచ్చట నుండినది విచారిం పతుదకు అతనిని ఓరంగలులో పట్టుకొని నేరము నొప్పించి అతడెత్తుకొని