పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54


పోయిన ధనమును, సొమ్ములను దొరకించు కొనినారు. అతడు రాజకీయ సంబంధమగు కాగితములు పనికి రావని కరీంనగరు కను మానకొండూరునకును మధ్యననుండు నదిలో పూడ్చి పెట్టి యుండెను. కాగితములన్నియు తాలుగ్గారున కియ్యబడెను. అతని యానందమునకు మేరయే లేదు. రెడ్డి గారిని గాఢముగా కౌగలించుకొని, ప్రత్యు కృతిగా ప్రభుత్వముద్వారా 125 రూపాయీల విలువకల రిపీటర్ గడియారమును బహుమతిగా నిచ్చెను. ఆగడియారమిప్పటికిని రెడ్డి గారివద్ద మంచి స్థితిలోనున్నది.


రెడ్డిగారు ఎల్లందల్ జిల్లాలోనుండు కాలములోనే వారిని తాత్కాలిక జిల్లా పోలీసు అధికారిగా 7 ఫర్వర్ది 1311 ఫసలీలో నియమించిరి. ఈ 8 ఏండ్ల లో రెంరెం దెందు ఉద్యో గముచేసిరో ఆయా స్థలములం దంతటను జిల్లా అధికారులు వీరిని చాల మెచ్చుకొని యుడిరి, 1308 ఫసలీలో ఇందూరుజిల్లా తాలూగ్దారు హేంకిన్ గారి కిట్లువ్రాసిరి:

"వేంకట రామా రెడ్డిగారు న్యాయశాస్త్రము తెలిసిన
వారు. మంచి అనుభవము సంపాదించినారు. వీరు నిజమైన
నిరంతర కృషి చేసి తమ కప్పగింపబడిన అభియో
గములలో విశేషముగా జయముందినారు. వీరిని
ఇప్పుడే మార్చవలదు. మార్చిన ఆ భి యోగము