పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

37


వెంటతీసికొని మేకటరామారెడ్డిగారిని వెంబడించుకొని బయలు దేరినారు. దొంగల జాడలు తీసి వారు రాయచూరు జిల్లా మాన్వీ తాలూకాలో నాగల్ బండ కస దొడ్డి అను గ్రామాలలో ఈ కొరవ లుండిరని ఒకని వలన విని ముందు నాగల్ బండకు పోయిరి. అచ్చట ఆనాడు దొంగలకు పండుగ. వారున్న యింటిని ముట్టడి వేసి లోపల దూరినారు. దొంగలు ఒక గదిలో జొరబడినారు. దొజకిరి లే యని బయట చిలుకు 'పెట్టి పోలీసువారు కావలి కూర్చున్నారు. కొంత సేపటికి దివటీలు తీసికొని తిన్నగా తలుపుతీసి నాలుగు మూలలు పరికిం చుచు లోపలికి వెళ్లినారు. ఎవ్వరును లేరు! - ఇంకొక గది కనబడినది. అందున్నారని తెరచి చూచినారు. అందునులేరు. ఇదేమిరా యని దిగ్బ్రమజెందినారు. మరొకలోపలి కొట్టిడీ చూచినారు. అందు మిద్దెలో ఒక పెద్ద రంధ్రము పడినది ఆ గదిలోని గుమ్ముల పై కెగబాకి గవాక్షమునుండి అందరును పారిపోయి నారు. అప్పుడు కసక్ దొడ్డి గ్రామములో ఆదొంగల జాడ కనిపెట్టి రాత్రి యంతయు సడిచి వెళ్లినారు. వారాగ్రామము లోను లేరు. తెల్ల వార నాలుగు గంటల కాలమైనది. ఊరిబయట చావడిలో పండుకొనుటకై పడకలు వేసినారు. అప్పుడొక గ్రామస్థుడు వచ్చి యిట్లని ఎచ్చరించినాడు. " మీ చావడీ ముందటి చెట్టు పైన నీ మంచెలు వేసుకొని కొంపదొంగలు పండు