పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

39


జరిగినది. మంచి సర్దారుమనిషి. గుజుగ భీమని కొడుకును మాత్రము గట్టిగా పట్టుకొని వదలిన వాడు కాడు. అదే దినము రెడ్డిగారి ఠాణాకు వానిని పట్టుకొని వచ్చినాడు. ముహరిరు తన విచారణ ప్రారంభించినాడు. అనగా పది పండ్రెండు మారులు కట్టెతో దొంగను మోదినాడు. దొంగ మూగివాడైపోయి నాడు. కన్నయ్యాలాల్ తహసీల్దారు వద్ద విచారణ జరిగినది. తహసీల్దారుగారితో వెంకోబరావు ఆదొంగ యొక్క నిర్దిషితమును గురించి గట్టిగా నచ్చ చెప్పినాడు. పైగా దొంగమూగి వాడని పైననే కనబడు చుండెను. దొంగ నిర్దోషియని నిర్ణయించి విడిచి పెట్టినాడు, రెడ్డిగారు రెండు దినాల తర్వాత ఏదోపని పై వెంకోబరావు ఇంటికి పోయి చూడగా ఆ మూగి దొంగ వెంకోబ రావుతో ముచ్చట్లు చేయుచున్నాడు! రెడ్డిగారీ ఆశ్చర్యమును జూచి దొంగ కిలకిల నవ్వినాడు. ఇప్పుడేమి భయము. తాను నిర్దోషియై పోయినాడు కదా!

ఇట్లుండ మరికొన్ని దినాల తర్వాత మస్కీలో “డాకా" (బందిపోటు దొంగతనము), జరిగినది. సుమారు 40 మంది కొరవలు దివటీలు పట్టుకొని గ్రామములో ప్రవేశించి యెదిరించిన వారిని మెదుగగొట్టి ఒక ధనికుని యింటిలో బడి అంతయు లూటీచేసుకొని పోయినారు. టాణా వార్త వచ్చిన వెంటనే రాజానాయకు మొహిరిర్ , కొందరి జవాసుల