పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25


ఆ భావములను పలుమారులు విన్న వారిలో ఈ పఠాన్ నజర్ మహమ్మద్ ఖాను గారొకరు

తన అన్న చనిపోయిన వెంటనే అతని తమ్ముడను కాన నాకును కొంత హక్కు కలదనియు స్కర్కారీ ఉద్యోగ మిప్పించ వలసినదనియు పరకాల రెడ్డి తాలూక్టారు సిఫారసుతో వినతిపత్ర మర్పించుకొన్నాడు. అది యట్లుండ నజర్ మహమ్మద్ ఖాను యువకుడగు వేంకటరామా రెడ్డిని హైదరాబాదు నగరముసకు పిలుచుకొని తనకు తెలిసిన నవాబులను పోలీసు అధికారులను, సూబేదారులను, మున్నగు వారి నందరిని దర్శించుకొన్నాడు. అంతకు ముందే పరకాల రెడ్డి ప్రయత్నము చేయు చుండినందున సజర్ మహమ్మద్ ఖాన్ అతని లోపములను తెలిపి విలియం వహబ్ గారి కోరికలను అభిలాషలను అధికారులకు తెలిపి వేంకట రామ రెడ్డికే ఉద్యోగ మియ్యవలెనని గోరెను.

అప్పటికి వేంకటరామారెడ్డి వయస్సు 17 సంవత్సరములు. ఇంకను బాలునివలెనే యుండెను. ఇప్పటి రూపమునకును అప్పటి రూపమునకును పూర్తిగా వ్యత్యాస ముండెను. బక్క పలుచని మనిషి. పోలీసు ఉద్యోగికి శరీర సౌష్టవము, మంచిఎత్తు, మంచితూకము, నాటికిని, నేటికిని అవసరము ఎత్తులో కూడ పొట్టివాడుగా నుండెను. తనను చూచిన అధికారు లుద్యోగ