పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22


దుఃఖించుచు కూర్చును వాడు. ఫకీరదిచూచి దగ్గరకు పిలిచి దుఃఖంచుటకు కారణ మేమని విచారించెను. తనకు కలిగిన విపత్తును, రానున్న అనిష్టమగు విపత్తును, ఆ పెద్దమను ష్యునితో చెప్పుకొనెను. మౌలీ గారు ఓపికతో అంతయును విని “అల్లా సర్వ సంరక్షణకర్త, అతడే నీకును సహాయపడును పో" అని ఓదార్చినారు. ఇంత మాత్రపు సంగతి రెడ్డిగారికిని తెలియును. కాని ప్రకృతాచరణ మెట్లో అది మాత్రము మౌల్వీ గారు చెప్పక పోయిరి. మరల వరుసగా ఆ వారము దినములు మౌల్వీ యొద్దకు వెళ్లి కన్నీరు కార్చుచు కూర్చును చుండెను. మౌల్వీకి చాల కరుణకలిగెను. దీర్ఘముగా ఆలోచించి ఈతడన దృఢముగానిట్లు పలికెను - "ఎమిన్నీ పర్వాలేదు. నీ కంతయు శుభమే కలుగును పో!", అని గట్టిగా వూని పలికినను, అది ఓదార్పు నీయలేదు.

మరునాడు రాయచూరును వదలి గ్రామమునకు పోవుటకై బండ్లు కదలుటకు సిద్ధమయ్యెను. క్షణకాల మాలన్యమై యుండిన సాగియేపోయి యుండును. అట్టి సన్ని వేశములో దైవికముగా నొక సంఘటనము సంభవించెను.

విలియం వహబ్ గారి కత్యంత పరిచితుడైన వాడు నజర్ మహమ్మద్ ఖాన్' అనునతడు. అతకు సీనియర్ అమిన్ గా నుండిన వాడై వహబ్ చనిపోగా అతని స్థానములో రాయ