పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23


చూరుజిల్లా పోలీసు అధికారిగా నియుక్తుడయ్యెను. అతడు ఆజాను బాహుడు. ఆరడుగుల యెత్తువాడు. స్ఫురద్రూపి. గాంభీర్యము కలవాడు. పఠానుజాతివాడు. విశ్వాసపాత్రుడైన మిత్రుడు. తన మిత్రుడు వహబ్ చనిపోయినందులకు చాల చింతించి అతని యింటిలో అతని బంధువుల పరామర్శింతమని వెళ్లెను. వెళ్లి చూడగా, బండ్లన్నియు ప్రయాణ సన్నాహములో నుండెను. వహాబు కాలములో ఆత నీయింటిలో బాలుడగు వేంకట రామా రెడ్డిని చూచిన వాడు కాన, అతనిని గురించి రామన్నతో నిట్లు సంభాషించెను.

" ఎక్కడికీ సన్నిహ మంతయు
" మా గ్రామమునకు వెళ్లుచున్నాము.
“ వేంకట రామారెడ్డిని చూపి) ఈ బాలునిగూడ తీసుకొని
పోయెదరా?
" అవును
" తీసికొనిపోయి?

  • వ్యవసాయము చేయింతుము!

" చదివించరా! " వీలుకాదు
" సరే. మీ రితనిని నాయొద్ద నే విడిచి పెట్టి వెడలిపొండు... 4
"వీలు లేదు