పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8


దేశములో నెందునూ ఈ గోత్రములకు సరిపోవునట్టి గ్రామములు లేవు. ఈ గోత్రములన్నియు శివసహస్ర నామావళి లోని శివనామముల అపభ్రంశ రూపములని కొందరి యభిప్రాయము. ఉండవచ్చును. రెడ్లు మొదలు జైనులుగా , నుండి యుందురు. తరువాత ఓరుగల్లు చక్రవర్తుల కాలములో శైవులె యుందురు. అప్పుడు శివదీక్ష పొంది, శివనామములనే గోత్రములుగా నేర్పాటు చేసికొని యుండవచ్చును. ఈవాద మెంత వరకు నిలుచునో బాగుగా పరిశోధించిన కాని నిష్కర్షగా చెప్పుటకు వీలు లేదు.

రెడ్లలో అనేక శాఖలు ప్రాచీనములో సీమా భేదము లనుబట్టి యేర్పడెను' అందుపాక నాటి, మోటాటి, పంట, గోనె, గుడాటి, ఎరవాటి మొదలగునవి విశేషముగా కనబడు చున్నవి. రెడ్లు మొదట ఉత్తర దేశమునందుండి రనియు, తర్వాత దక్షిణము నకు వలస వచ్చిరనియు, అట్లు వచ్చిన వారిలో “ మొదటవచ్చినవారు మోటాటి వారు" అనియు చెప్పుచుందురు. మోటాటివారిలో 360 గోత్రముల వారున్నారనియు, పాకనాటిలో 120 గోత్రముల వారున్నార నియు చెప్పుదురు. రెడ్లను, ఆశ్రయించి, బ్రతుకునట్టి “పిచ్చుకుంట్ల” వారు అనునొక తెగ వారు, జంగము కథారూషముగా ఈ వలస యొక్క కథను; గోత్రముల వివరములను ఆ గోత్రములవారి