పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208


అలా డును. మరియుకృషి, విభజనయందును, క్రమాగత సంఖ్యను బట్టియు భారత సామ్రాజ్యమున కర్షకుల తర్వాత పద్మశాలీ యులే దేశసంరక్షణకు కారణభూతులు. ఈ విషయము గాంచుచు యీసమయమున మీ మద్యనుండుట వలన నాకు మరింత యుత్సాహము జనించుచున్నది.


ఈ సమయమున నేజేయ సంతోషదాయక కర్తవ్యము ప్రదర్శన ప్రారంభమే. అయినను; ముగ కొన్ని భావముల వ్యక్తి పచుట అనుచితము కాదు.


ఆధునిక యుగయంత్రాభి వృద్ధి మూలమున హస్త వస్త్ర పరిశ్రమ గతి గోషి యైగదని విశ్వసించు వారల హ్రస్వదృష్టిని నేను మెచ్చుకొనను. భారతము సందు పల్లెపదములును కర్షక నృత్తి యు ఉన్నంత వరకు కిరవసస పరిశ్రమ మిగిలియుండు నని నా నిగూఢ విశ్వాసము. ఉపయోగించువారి అభిగుచిని.బట్టి హెచ్చు తచ్చులు కలుగవచ్చును. కాలమునుపెట్టి వ్యవసాయమున కరువు, దుష్కాలమునున్నటు" సత్కాలము ఫలించు టత్యవసరములు.


భారత దేశముయొక్క పురాతన మైనట్టియు ముఖ్యమై నట్టియునగు వస్త్ర పరిశ్రమ సజీవముగ నుండటకై పద్మశాలీ యులు ధైర్యముతో, తెలివితో, కృషితో సర్వప్రయత్నముల సలుపుట అత్యవసరము. తర్వాత దేశీయుల మెప్పుదల మరియు ప్రభుత్వ సహాయము పై వారు నమ్మక ముంచవలెను.