పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ ఖిలభారత పద్మశాలీయు మహాసభ

వస్త్ర ప్రదర్శన ప్రారంభోపన్యాసము

8 ఆ బాన్ 1338 ఫసలీ నాడు మ. రా. రాజశ్రీ రాజబహద్దరు కొత్వాలు వేంకట రామా రెడ్డిగారు ప్రదర్శన మును తెరచుచు ఉర్దూ భాషలో నీ క్రిందియుపన్యాసము నొసంగిరి.

స్నేహితులారా !

అఖిలభారత పద్మశాలీయ మహాసభ సందర్భమున వస్త్రప్రదర్శన ప్రారంభోత్సవ మొనరించుట నాకొరకు మిగుల ముదావహ విషయము. కర్షకవృతి కి జెందిన వాడనగు నాకు జానపద పరిశ్రమయగు న స్త్రనిర్మాణముతోగల గాఢ సంబం ధమును మీరు దృష్టి ముం దుంచుకొని ఈయుత్కృష్టాత్సవము నందు పాల్గొనుటకవకాశ మొసంగినందులకు నే నెంతయు హృదయ పూర్వకముగ మెచ్చుకొనుచున్నాను.


జానపద జీవితమున కర్షక వృత్తికిని వస్త్ర పరిశ్రమకును కుడి యెడమ కరములకు గలసామాన్య సంబంధము కలదు. ఐశ్వర్య వృత్తి యం దీ రెండును కలసి మెలసి పనిచేయుచుం