పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

206


పరోపకార పారీణురాండ్రగు గద్వాల, వనపర్తిరాణులున్నా రు, అన్నిటికంటికంటే ప్రధాన మైన రాజ' ఒహద్దగు వేంకట రామా రెడ్డిగారున్నారు. హైదరాబాదులో సుమారు 70కు లక్షల రూప్యములను వెచ్చించి, 150 మంది విద్యార్థుల నివాస, భోజనాదులకు వసతి భవనాలు నిర్మింపబడిన వంటే 250 మంది బాలికల విద్యాభివృద్ధికై ప్రశస్తమైన ఒక బాలి కోన్నత పాఠశాల స్టాపితమై జయప్రదంగా నిర్వహింపబడుతూ ఉన్నదంటే కవులు, గాయకులు', పండితులు సన్మా నింప బడుతున్నారంటే – ఈలాటి ప్రజోపయోగ కార్యాలలో వేంకట రామా రెడ్డిగారు ప్రకటించే అభిమానము, చూపే శ్రద్ధ, చేసేశ్రమ ముఖ్య కారణాలుగా కనిపిస్తున్న వి. వీరు సహాయముచేయని సంస్థ లేదు, ఆదరింపని పండితుకు లేరు, దాతృత్వము చూపని ఆశ్రితుడు లేడు. డెబ్బది లక్షల ప్రజకు మిత్రులు, నాయకులు, ఉద్గారకులు ప్రజ యొక్క ప్రభుత్వము యొక్క అనురాగానికి పాత్రులు మన రాజాబహద్దరు వేంకట రామారెడ్డి గారు.



అవుటుపల్లి నారాయణ రావు