పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204


చివరకు వేంకట రామా రెడ్డి గారు పింఛను పుచ్చుకొని తమయుద్యోగంనుంచి మరల వలసివచ్చిపడు ప్రజలు దీనిని ఒక నష్టంగా తలచి బహుదుఃఖించిరి. ఈసందర్భం లో పోలీసువారు, ఆయాసంస్థలలో నిర్వాహకులు, పౌరులు, తమ విచారాన్ని ఒక ప్రక్క; రెడ్డిగారి పై గల ప్రేమను అభిమానాన్ని పూజ్య భావాన్ని తెలుపుతూ యింకోప్రక్క; సమర్చించిన అసంఖ్యాకము లగు పత్రములే నిదర్శనములు. ప్రజలు ప్రకటించిన సద్భా వంకంటె నైజాంప్రభువిట్టి ప్రజాభిమాని యగు నుద్యోగీని వదలుకొనుట కిష్టం లేక తమ సొంత ఎస్టేటు ఐన సరఫ్ ఖాస్ ఉద్యోగిగా నియమించి ప్రకటించిన గౌరభావం మహత్తరమైన విషయం మరువ తగనిది. నైజాము ప్రభువునకును వేంకటరామా రెడ్డిగారి కిని గల సన్నిహిత సంబంధాన్ని బట్టి యీ గౌరవభావం సహజంగానే ఉన్నది.


హైదరాబాదు రాష్ట్రంలోని ఒక కోటి 44 లక్షల ప్రజ లోను 70 లక్షలమంది ఆంధ్రులు, విశ్వవిద్యాలయ పండితులు లాయరులు, డాక్టర్లు, వర్తకులు, ధనవంతులు, ఎందరోవున్నా రు కానివీరు అందరిలోను ఆంగ్ల విద్యాపరిచయం లేనట్టి, ఆధునిక నాగరికత అబ్బనట్టి, పట్టి సామాన్య వ్యక్తి గా తమజీవితాన్ని ప్రారంభించినట్టి,కొత్వాలు, వేంక ట్రామా రెడ్డి గారివలె అంతగా ప్రజయొక్క, ప్రభుత్వం యొక్క, నిజాం ప్రభువుయొక్క గౌరవానికి