పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

205


అనుగ్రహానికి పాత్రమై అపారమైన తమ పలుకుబడికి ప్రజోప యోగ కార్యాలకై వినియోగించి వారు మిక్కిలి తక్కువ. ఈ గౌరవాన్ని పుట్టించింది ఉద్యోగమా? కాదు. విద్యా! కా దు. భాగ్యమా? కాదు. వేంక ట్రామా రెడ్డి గారియందు సహ జంగా వున్న శక్తి సామర్ధ్యాలు. సమదృషి, న్యాయశీలము, సేవాభిలాష ప్రబల కారణాలని నా నమ్మకము. నిజాం రాష్ట్ర ములోని 70 లక్షల అంద్రులలోను ప్రజలకు సహాయం చేసే వారు, యిచ్చయున్న వారు, చేస్తూ యున్న వారు మన మేకట రామా రెడ్డి గారే. వీరి స్వభావం చేతనైన ఉపకారం చేయటం కాని తీయ్యని మాటలు చెప్పి పంపడం కాదు. ఉద్యోగీయులమని ప్రజకు దూరంగా వుండటం కాదు. వారితో కలిసి వారికష్ట సుఖాలను గ్రహించి వారికి తోడ్పదుతూ ఉండడమే వీరి ఆశయము, హైదరాదులో ఆధ్రులకు గౌరవ ప్రతిష్ఠ లేమఁయినా కలిగి ట్లయితే అవి కొత్వాలు వేంక ట్రామా రెడ్డి గారి యొక్క డాక్టరు గోవింద రాజులు నాయుడు గారి యొక్క పేర్లను ఆశ్ర యించియున్నవి.


మొత్తాన హైద్రాబాదు రాష్టీయాంధ్రులలో ప్రత్యే క వ్యక్తిత్వము, జాత్యభిమానం, స్వయం సహాయ కృషి అంటూ వొకటివుంటే, అది రెడ్లలో మాత్రమున్నది. వీరిలో విద్య యున్నది. ద్రవ్యమున్నది. నాయకత్వమున్న ది.