పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

201


లింపలేదు. రాజ్యాంగ శాస్త్రాన్ని పరికింప లేదు. ఈ లాటి శిక్షణ యేమీ లేకపోయినప్పటికి ముస్లిమురాష్ట్రాలికి ప్రధాన నగరమున్ను, అనేక జాతుల ప్రముఖులకు నివాసస్థానమున్ను అయిన హైదరాబాదు కొత్వాలు పని అనగా పోలీసు కమిష నకు పదవినే ఎట్లా నిర్వహించారు? నిజాం ప్రభువుయొక్క ప్రత్యేక విశ్వాసానికి, గౌర వానికి. యెట్లా పాత్రులయినారు? గొప్పసమర్థులు, రాజనీతిజ్ఞులు అనే ప్రతిష్టను ఎట్లాగడించారు? ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానము బట్టే వేంకట రామా రెడ్డి గారి పరిపాలనా డక్షత యొక్క రహస్యము గ్రాహ్యమగుతుంది. ఆధునిక విద్యావంతులలో మంచితనము, పరోపకారబుద్ది లేవని చెప్పునుగాని, వేకట రామా రెడ్డి గారికి ఆధునిక నాగరికత విశేషముగా అబ్బకపోవడం మీదనే వారిలో అధికముగా కనుపించే ప్రాచీనుల నిగర్వము, సేవానురాగము, ప్రజోపయోగ కార్యనిరతి, కల్మష రహితమైన వర్తనము, సర్వజన శ్రేయోభిలాష జయ పదమగు పాలనము ఆధారపడి యున్నదని నావిశ్వాసము. విద్యవల్ల లభింపని యోగ్యత, సామర్థ్యము, పరిపాలనా దక్షత అనుభవంవల్ల స్వయు శిక్షల వల్ల లభించినవి. కేవలము స్వశ క్తివల్ల ఉన్న తస్థితికి వచ్చిరి.'


హైద్రాబాదు సంప్రదాయం విశేషంగా ముస్లిం నాగరికతకు సంబంధించివున్నది. అయినా రాజ్యాంగంలో హిం