పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

195


కప్పుకొని వచ్చిన వానిని వీరు చాలశ్రద్ధగా యోపికతో విచారించి వారికష్టములు విచారించుట కై వెంటనే ఆజ్ఞలనిచ్చు వారు.


వీరు కచ్చేరీ చేసిన అది కచ్చేరీవలె నుండదు. ఒక పటేలు గారి చావడివలె నుండెడిది- బీద వారందరు దరఖాస్తులు వీరికే యిత్తురు గాని యితరుల కియ్యరు. వారిని పిలిచి వారి దరఖా స్తులు చదివి వారిని విచారించి వారు చెప్పుకొను కథలనంతయు నోపికతో విని యథా యోగ్యముగా విచారణ చేపెడివారు. కొన్ని సందర్భములలో పోలీసులకు సంబంధించని షికాయ తులుకూడ వీరివద్దకు తెత్తురు. అని న్యాయమనితోచిన ఉభ యపక్షముల వారిని పిలిపించి రాజీ చేయించి తీర్పు చేసెడివారు. ఇట్లు చేయుటచే వేలకొలది మందికి ద్రవ్యనష్టము, క్లేశము, ఇతర యిబ్బందులు అన్నియు మిగిలి పోయినవి.


వీరు పేరునకు 10 గంటలనుండి 4 గంటలవరకు కచేరీ నౌకరి చేయువారు. కాని నిజముగా చూచిన రాత్రి 12 గంటల నుండి తెల్లవార 4 గంటలవరకు తప్ప తక్కిన 12 గంటలకాలము వీరు సర్కారీ నౌకరి చేసినట్లే. సగము రాత్రి వరకు నగరములో జరుగు నేరములు ఎప్పటి కప్పుడు టెలి ఫోను ద్వారా ప్రతి నాకానుండి వీరికి తెలుపుచుండెడి వారు. ప్రతివారికి వీరు టెలిఫాను ద్వారానే హుకుము లిచ్చుచుండిరి.