పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాత్రి కాలములో 10 నుండి 12 వరకు కూడ జనులు తమకు విపత్తుకలిగిన పోలీసు సహాయ మవసరమైన స్వయముగా పోయి వీరితో చెప్పు కొనెడివారు. పేరుకు పోలీసు పహిరా యింటి పైనున్నది. కాని యెవ్వరు కొత్వాలీ దేవిడీలో పోయినసు, “ఎవరు, ఎక్కడ, ఎందుకు". అని విచారించువారే 'లేరు. ఇదియే నిజమైన రక్షక భటుపై పెద్దల కుండ వలసిన ముఖ్య లక్షణము.


కేవలము కోత్వాలీ పదవి'యే కాక వీకు ప్రతి దినము సాయంకాలము తన యేలికలగు , ప్రభువుగారి దర్శనమున కేగి యొక్కొక్కమారు గంట రెండు గంటల వరకు వారికిని వే దించుటయో వారి ఆలను నిర్వహించుటయో చేయచుం డెడివారు. వీరియందు శ్రీ ప్రభువుగారి కుండునట్టి విశ్వాసము బహుశ రాష్ట్రములో నింకెవ్వరిపై నను లేదనవచ్చును.


కొత్వాలు వేంకట రామా రెడ్డి గారు కోత్వాలీ పని లోనే కాక యితర సంస్థల లోను చాల సాయపడువారు. శాసన సభ, సఫాయి, సర్బెఖాసు కమిటీ, కో ఆప రేటివ్ యూనియన్ మున్నగు ప్రభుత్వ శాఖలలోనే కాక అనేక ప్రజాసంస్థలగు విద్యాసంస్థలందును ముఖ్యులై తను యమాల్యాసుభవ జనితము లైన అభిప్రాయములతో తోడ్పడెడు వారు.