పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4


మందు సాధారణ విద్య నభ్యసించిరి. ఈనాడుండునట్టి విద్యా సౌకర్యములు 20 ఏండ్ల క్రిందట లేకుండెను. ఆ కాలములో మంచి విద్యావంతు లనిన అపురూపము మనుష్యులుగా పరిగణింప బడుచుండిరి. వీరి బాల్యములోనే వీరి సంరక్షణ కర్తయును, మేవమామయు నగువారు, అకాల మరణ మొందిరి. ఇక వీరికి సహాయపడు వారు అరుదైపోయిరి. అట్టివారు ఆదిలో నొక సాధారణమగు అమీన్ పదవి నుండి, క్రమముగా ఉన్నత పదవుల పొందుచు, హైదరాబాదు నగగ కొత్వాలు పదవిని పొందినారనిన, దానికి ముఖ్య కారణము లుండవలెను. అవి వారి గుణవిశేషములే. వీరి యుద్యోగ కాలములోని చరిత్ర నంతయు పరిశీలించి చూచిన, వీటి రెండు ముఖ్యగుణములు కనబడుచున్నవి. నిరంతర కృషి, శ్రద్ధ, న్యాయ దృష్టి, యివి వీరి ప్రథాన గుణములు.


ఉన్నతో ద్యోగములు పొందిన వారు హైదరాబాదు రాష్ట్రములో వందలకొలది, వేలకొలది కలరు. నగరకొత్యాలు పదవి నలంకరించిన కొత్వాళ్లేందరో వీరికన్న ముందు కాల ములలో పదవిని నిర్వహించి యుండిరి. కాని వారెవ్వరును ప్రజల స్మృతిపథము నందు లేరు. వీరు మాత్రము సర్వజనులచేతను, నిఖిల నిజాం రాష్ట్రము చేతను, నిఖిల ఆంధ్రుల చేతను, కొనియాడబడు చున్నారు. ముందు కాలమందును, అజరామరముగా, వీరు నిజాం రాష్ట్ర వాసులచేతను అందు ముఖ్యముగా ఆంధ్రుల చేతను కీర్తినీయులై యుందురనుటలో అతిశయోకి, లేదు. D