పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3


ఈ ఇద్దరును కట్టె గుడిసెలలో పుట్టినారు. ఇద్దరును బీదవారే. ఇద్దరికిని బాల్యదశలో విద్యా సౌకర్యములు కలుగకపోయెను. లింకను యొక్క ఎనిమిదవ యేటనే అతని తల్లి గతించెను. గార్ ఫీల్డుకు ( నెలలుకూడ నిండక మునుపే అతని తండ్రి గతించెను. ఈ యిరువుకును కష్టపడు స్వభావము కలవారనియు, సమయస్ఫూర్తి కలవారనియు, పట్టుదల, విశ్యాసపాత్రత, ధైర్యము, మిత జీవనము, విషయగ్రహణము, సమ యజ్ఞత, క్రమ నిర్ణయము, దాతృత్వము కలవారనియు, ప్రసిద్ది గన్న వారు (Both were well.known for their industry, tact, perseverance, Integrity, courage, economy, thoroughness, punctuality, decision, and ben. evolence ) ఈ వాక్యములను జదివిన వెంటనే నిజాం రాష్ట్ర జనులందరికిని రాజా వేంకటరామా రెడ్డి బహద్దరు ఓ. బి. ఇ గారు, తప్పక జ్ఞాపకము రాకమానరు. రాజా వేకటరామా రెడ్డిగారు పై యిరువురి మహాపురుషుల గుణములలో, ఇంచు మించు అన్ని గుణములను గలిగినట్టివారు. వారి వలెనే వీరును ( అంత బీద కుటుంబమువారు కాకపోయినను) సా ధారణ పటేండ్ల కుటుంబమువారు. వారివలెనే వీరును తమ బాల్య మునందే తల్లి దండ్రులను పోగొట్టు కొన్నట్టివారు. వీరు జన్మించిన మూడవ దినమునాడే వీరి తల్లి చనిపోయెను. వీరి ఐదవ సంవత్సరమునందే వీరి తండ్రి గతించెను. బాల్య