పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

193


గోత్వాలు పదవి కత్తి పై సాము వంటిది. "క్షుర స్యధారానిసితం దురత్యయా" అనునది వేదాంత సంబంధ మైన దైనను నీపదవికి వర్తించునదే, అందు హైదరాబాదు కోత్వాలు పదవియనిన అది ప్రత్యేకత గలదే యనవలెను. పూర్వము కొత్వాలుగా నుండిన వారి పద్ధతులు వేరు. ఆకాలము వేరు, కాని యీ కాలము దినదినము నాజూకు అగుచున్నది. వీరు కొత్వాలు పదవికి వచ్చిన కాలములో నేను శీతాచల పర్యంతము సంచలనము కలిగించు చున్న అసహాయోద్యమ ఖిలాఫతు ప్రచారము మిన్ను ముట్టు చుండెను. హైదరాబాదులో కూడ సంచలము కలిగెను. కానియేమాత్రమును గడబిడలు కాకుం డునట్లుగా నాయద్యమ ములను వశపరచుకొనెను. ఆయుద్యమముల యనంతర మింకొక విపరీతోద్యమము హిందూ స్థానమంతటను జర్మను విషవాయువువలె వ్యాపించుకొనెను. ఏనగరమున జూచి సను హిందూముసల్మానుల కలహములే. బ్రిటిషిండియా రాజకీయ వాతావరణ మేరీతిగా నుండునో ఆరీతిగా నించుమించు సంస్థానములో గూడ నుండును. మన రాష్ట్రము లో గూడ నా గాలివీచెను. జిల్లాలలో అనేక చోట్ల గుల్బర్గా, సూర్యా పేట, నాందేడు మున్నగు ననేక ప్రదేశములలో హిందూ ముసల్మాను కలహములు జరిగెను. కాని హైదరాబాదు నగరములో నేటివరకు ఒక్క కలహమైనను జరుగ లేదు. ఇది సామాన్యవిష