పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజా వేంకట రామారెడ్డి బహద్దరు ఓ. బి. ఇ. గారికి రెడ్డి వసతిగృహ విద్యార్థులు సమర్పించిన అభినందన పత్రము


పూజ్యమహాశయా !


నమస్కారములు. హృదయపూర్వక నమస్కారములు. దాదాపు అర్ధ శతాబ్దమువరకు అసమాన ప్రతిభతో రక్షక పోలీసుల శాఖయందలి వివిధ పదవులను, ముఖ్యముగా 14 సంవత్సరములనుండి క్లిష్ట బాధ్యతలు గల నగరపు కోత్వాలి పదవిని మహా ఘనత వహించిన ప్రభునత్త మునకు ఆమోదకరముగను, ప్రజలకు అనురంజక ముగను నిర్వహిఁచి ఉపకార వేతసము (వజీఫా) పొందిన మీకు, మీ కృపావి శేషమున ఆర్జించు విజ్ఞానమునకును, పొందుచున్న వికాసఘు నకును, యావజ్జీవము కృతజ్ఞతా బద్ధులమగు మేయి, ఈ సందర్భమున అభినందన పత్రమును సమర్పించు గౌరవము గలుగ జేసుకొను చున్నాము.

దేశ సేవాపరాయణా,


మాతృ దేశమగు నీ రాష్ట్రమునకు మీరు చేసిన సేవ యపారము. మీ తోడ్పాటుపొందని సదుద్యమము లేదు. మీ చేయూతబడయని విద్యాసంస్థ లేదు. మీ సహాయ సానుభూతుల సందని సంస్థానము లేదు. బ్రిటిషు ప్రభుత్వము