పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180


మిమ్ముల ఓ. బి. ఇ. బిరుదముచే సత్కరించెను. మన ప్రభువు గారికి మీ యెడలగల విశ్వాసాతిశయమునకు, మీ నామము సలంకరించుచున్న రాజాబహదరు బిరుద మేగాక, ఒక ప్రక్క మీకు నుపకార వేతన మొసంగుచు, వేరొక ప్రక్క సగఫ్ ఖాసు ముబారకు నందు ఉన్నత పదవి ననుగ్రహించి, శాసన సభయందును, పురపాలక సభయందును, అనాథాలయము నందును, తదితర యుపసంఘముల యందును, మిమ్మ తమ ప్రతినిధిగా నియోగించుటయే ప్రబల నిదర్శనము .


సర్వకులోద్ధారకా,


మీరు రెడ్డి సోదరులకు నిరుమానముగు సహాయము చేసితిరనుటకంటె, రెడ్డి కులోద్దరణ మే మీ జీవితాదర్శమన దగును. ఒక నాడు ప్రభువులై, ప్రభుభక్తి పరాయణులై , వీరులై, వీరజవ పోషకులై కవులై, కవిజనాశ్రయలై చరిత్రకు వన్నె దెచ్చి, మాతృ దేశమును తేజోవంతముగన, విజ్ఞాన వంతము గను జేసి యలరిన రెడ్డి కులజులు, కొండొక నాటికి, స్వతంత్రాభిలాషచే కాబోలు, గ్రామవాస మేర్పరచుకొని అజ్ఞానాంధకార నిమగ్నులై, సంఘీభావ దూరలై, దుర్దశ బెందియుండుటను మొట్ట మొదట పరికించిన వారు మీరే. వారి పునరుద్దరణము నకు సంకల్పించిన వారు మీరే. కార్యారంభ మొనర్చిన వారును మీరే- నేను వారియందు వ్యక్త మగుచున్న ప్రబోధ 1.