పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162


యుందురు. వారందరితోను తీరికతో మాట్లాడుదురు. 12 గంటలసగము రాత్రి వేళ వరకీ ప్రకారముగా ముచ్చటించిన తర్వాత అందరిని పంపి వేసి నిద్రపోదురు. 12 నుండి తెల్లవార 5 గంటలు కొట్టువరకు అనగా అయిదు గంటల కాలము మాత్రమే నిద్ర పోవుదురు. ఇది వారి దినచర్య. దీనిని బట్టి వారు ఎంతటి విరామము లేని వారో, ఎంతటి పరిశ్రమ చేయువారో, యెంతటి ఓర్చుకల వారో బోధపడగలదు. కార్య బా హుళ్య మెక్కువైనప్పుడు అనేకులకు చీదరింపులును, కసరు కొనుటలును, కోపము తెచ్చుకొనుటలును కలుగుట సహజము. కాని శ్రీ రెడ్డి గారు నిండుకుండవలె తొణకని వారై, శాంత మూర్తులై యెవ్వరెవ్వరి నెట్లెట్లు తృప్తి పరచవలయునో ఆ ప్రకారము చేసిపంపుచుందురు. నారికీ కోపము చాల అరుదుగా కలుగును, కాని ఆకోపము విచిత్రమైన కోపమే. చాల మందికి దాని రహస్యము తెలియదన్న మాట. వారు కార్య సాధనకై కొన్ని సమయములలో ఉగ్ర భైరవరూపము దాల్తురు. వారు కోపించు కొనిరా ఎదుటి వారు గడగడలాడి పోదురు. అంతటితో కార్యసాధనమైనట్లే! తప్పు చేసిన వా రింకొక మారుచేసి ఆ ఉగ్రస్వరూపమునకు గురికానొల్లరు. కాని లోపలి రహస్య మేమన ఆ లోపములోనే ప్రేమ యిమిడి యున్నది. తప్పు చేసిన వాడు సవరించుకొని బాగుపడ వలెనను