పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114


వాడు మమ్ముల బ్రతుక నియ్యడు" అని ప్రాధేయపడినారు. కొత్యాలుగారు ఆదొంగను పోలీసు జవానుల వశము చేసి న్యాయస్థానములో విచారణ చేయించి శిక్షింప జేసినారు. ఆ దొంగను దొరకినప్పుడే పోలీసు భటుల వశము చేయక వానిని 12 గంటల కాలము తన వద్దనే స్వేచ్ఛతోనుంచి బేడీ లైనను వేయక తన మోటారులోనే తిప్పి తర్వాత పోలీసు వారి పశము చేయుటలో రెడ్డిగారి ఆత్మవిశ్వాసము ధైర్యమును ప్రశంస నీయములు. శిక్ష పొందిన తర్వాత ఆ దొంగ ఇట్లన్నాడట " కొత్వాలు: సాబ్ ఇంత మోసము చేయునని నాకప్పుడే తెలిసియుండిన నేనా రాత్రియే ఆయనను ముగించి యుందును, ఆ అందుపై రెడ్డిగారిట్ల నిరట. “అదేమో నిజమే, వాడేమిచేసి నను సాధ్యముగా నుండెను".


రెడ్డిగారి కొత్వాలీ కచ్చేరీ వ్యవహారములు బహువినోద కరముగా నుండెడివి. వారియా స్థానములోనికి ఏ పోలీసు వాని అడ్డంకును లేక ఎట్టి దరిద్రుడైనను, పోవచ్చును. హాలంతయు పోలీసులచేతను, చేతి క్రింది అధికారులచేతను, వకీళ్ల చేతను, గుమాస్తాలచేతను, అభ్యర్థుల చేతను నిందితులచేతను క్రిక్కిరిసి యుండెడిది. కొందరు బోగమువారు నగరములో కొన్ని దినాలు గాన సభలు చేసికొనుటకు స్వయముగా కచ్చేరీ నలంకరించి వినతి పత్రము లర్పించుకొను చుందురు. వారితో ముచ్చటించి తీర్పులు చేయుదురు, కొన్ని మొరలీవిధముగా నుండెడివి.