పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

113


బహుమతి యిచ్చునట్లు ప్రభుత్వమువారు ప్రకటించియుండిరి. రెడ్డిగారు ఒకనాడు తెల్లవారు జామున ఎండ కాలములో తన యింటిలోని వసారాలో ద్వారము లన్నియు తెరచిపఁడు కొనియుఁడగా నొక ఆయథపాణియగు వాడు పహిరా పోలీసులు నిరాకరించి నను వినక వారిని త్రోసివేసి పోలీసులచే వెంబడింపబడినవాడై కొత్వాలు గారిని సమీపించెను. వాని వద్ద ఒక తుపాకీయు, ఒక పిస్టలును, ఒక కత్తియు, నడుములో బాకులును ఉండెను! కొత్వాలు గారికి వాని వార్తను రోహలా పహిరా జవాను తెలిపినాడు. వానినిదగ్గకు పిలిచినారు. వాడు కొత్వాలు గారి కాళ్లుపట్టు కొని తానే దావూద్ పేరుగల దొంగనని తెలుపుకొని తనను రక్షించుమని వేడినాడు. “సరే. ఇచ్చటనే పండుకొనుము. నీ కేమియు భయము లేదు". అనినారు కొత్వాలు. వాని ఆయుధములను మాత్రము తీసివేయించినారు. వానికి భోజనము పెట్టించినారు. తమ మోటారులో వానిని తీసికొని పోపుచు ఏ యే మార్వాడీలకు వాడిబ్బంది కలిగించి యుండెనో వారి వద్దకు వెళ్ళి " దావూద్ అను దొ0గను ఎరుగుదురా? అని వారిని ప్రశ్నంచగా వారు మోటారులోనే డ్రైవరు ప్రక్కననే ఆదొంగయున్నను గుర్తు పట్టజాలక వాని దౌర్జన్యములను వర్ణించి “సర్కార్ వాన్ని పట్టుకొని ఉరివేయించండి తలనరికించండి. లేకుంటే