పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108


తాము నాల్గవవారై గణపతి విగ్రహముండు పల్లకీని మోసి కొనిపోవుటకు సమకట్టిరి! అంతటితో హిందువులు శాంతించి యథాప్రకారముగా గణపతి ఊరేగింపును ముగించుకొని వెళ్లి పోయిరి.


నగరములో బక్రీదు వంటి పండుగల సందర్భములలో ముసల్మానులకును, లోధీలు అను హిందువులకును, సంఘర్షణ యేర్చడు సూచనలు కనుపించెడివి. ఆ సందర్భము లలో రెడ్డి గారు బహు చాకచక్యముతో, లోథీలలోని ముఖ్యులను తాత్కాలిక పోలీసు సిబ్బందిలోనికి తీసుకొని వారి ద్వారా శాంతిని నెలకొల్పడివారు.

కొత్వాలీ పదవిలో నింకొక ముఖ్యాంగము శ్రీ నిజాం గారి సేవయైయుండెను. ప్రాచీనము నుండియు నగరకొత్వాలు ముఖ్యముగా నిజముగారి మొదటి బంటు. ప్రతిదినము తన ప్రభువుతో కలిసి నగరములోని పరిస్థితులు తెలుపుటయు, ప్రభువుగారి ఆజ్ఞలను శిరసా వహించు టయు నతని ముఖ్యమైన విధులు. ప్రభువుగారి డేవిడీలోని కార్యములను, పోలీసు జవానలద్వారా పూర్తి కావించ వలసియుండెను. మరియు పూర్వము ప్రభువుల కెవ్వరిపైనా నేని ఆగ్రహముకలిగిన కొత్వాలును పిలిపించి అతనిద్వారా వారిని నిర్బంధమందుంచు చుండెడివారు. ఇట్టి కార్యవిధానములలో ఆధునిక పరిస్థితుల బట్టి