పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106


" వైస్రాయిగారి ఆగమన సందర్భములో తాము చేసిన
       ఉత్తమమైన మీ పోలీసు ఏర్పాటులను నేనత్యంతముగా
       ప్రశంసించుచున్నాను. నే నిచ్చట ఎన్నియో సంవత్స
       రముల నుండి నివసించుచున్నాను. ఈ తడవ మీ
       ఏర్పాటులకన్న మించిన యేర్పాటులను నేనెన్నడును
       జూచియుండలేదు. అన్నిటి కన్న ఆనంద దాయకమగు
       విషయ మేమన - ప్రజల కేవిధముగు ఇబ్బందులు కలుగ
       లేదు. ఇదివరలో గంటలకొలది కాలము వరకు బాటలు
       అరికట్టబడుచుండెను. అట్టిది యీ తడవ లేకుండినది.”


రా|| బ| వేంకట రామా రెడ్డిగా ఉద్యోగ కాలము లోని అన్నింటికన్న ముఖ్య మగునంశము చెప్పవలసియున్న ది. నగరములో నానా మతముల వారున్నను వారి కాలములో ఎన్నడుగాని మతకలహములన్న మాట లేకుండెను. సుమారు 15 సంవత్సరముల నుండి హిందూస్థానములో హిందూ, ముసల్మానుల ద్వేషములు, కలహములు, నిత్యాభివృద్ధితో ప్రబలుచు వచ్చెను. కేవలము బ్రిటిషిండియాలోనే గాక అనేక దేశీయ సంస్థానములందును ఈ కలహములు సంభవించెను. హైదరా బాదులోని, జిల్లాలలోను అందందు కొంచెము పొడచూపినను హైద్రాబాదు ముఖ్యపట్టణములో మాత్రము వీరి కాలములో ఒకనాడైనను హిందూ ముసల్మానుల కలహములు జరుగక