పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

105


క్రీ. శ. 1923 లో వైస్రాయిగారు వచ్చిన సందర్భమున వేంకట రామారెడ్డి గారు చేసిన ఏర్పాట్లను చూచి ఇప్పుడు ప్రధాన మంత్రిగా నుండి అప్పుడు ఆర్థిక శాఖా మంత్రిగా మండిన సవాబ్ సర్ హైదర్ నవాజుజంగు బహదరుగారు చాల ప్రశంసించిరి, మరియు 1330 ఫసలీ నాటి " కొత్వాలీ శాఖా నివేదికను చదివి సర్ అక్బర్ హైదరీ గారిట్లు రెడ్డిగా రికి 5 జులై 19233 నాడు వ్రాసిరి.


“మీ నివేదిక నిప్పుడే అందుకున్నాను. మేమందరమును ( ఈమాట నా ఉద్యోగ ధర్మముచేతనే కాక నా హైద్రాబాదు పౌరత్వ ధర్మము చేతను చెప్పుచున్నాను) మీ కఠినమైన ఉద్యోగవిధులను మీ రెట్టి చాకచక్యముతోను, విశ్వాస పాత్రముగను, భక్తి తోను, నిర్వహించుచున్నారో , ఆపద్ధతిని అత్యంతముగా ప్రశంసించుచున్నాము.


"(It is not necessary for me to say how we all (& in this I am speaking not only in my official capacity but also as a citizen of Hyderabad) appreciate the great tact, honesty, and loyalty, with which you are discharging the duties of your onerous position.)


క్రీ. శ. 1923 లో ప్రధాన మంత్రిగా నుండిన సవాబ్ ఫరీదూ ముల్కు గారును వైస్రాయిగారి ఆగమన సందర్భపు టేర్పాటులను ప్రశంసించుచు నిట్లు వ్రాసిరి:--