పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

95


హైద్రాబాదులో సర్ అలీ ఇమాము గారు ప్రధాన మంత్రి గాను, రన్సల్ అనువారు రెసిడెంటుగాను నుండిరి. వీరును ఇతర మంత్రివర్గము వారును, శ్రీ నిజాం ప్రభువు గారును. అందరును వేల్సు యువరాజుగారిని మోటారులోనే తీసుకొని పోవుట యుక్త మని నిర్ణయించిరి. తుదకు వేంకట రామా రెడ్డి గారిని పిలిపించి వారి అభిప్రాయ మడిగిరి. " వేల్సు యఃపగాజు గారు బగ్గీలోనే వెళ్ల నిశ్చయించిన అటులే కానీయడు. అన్నిటికి నేను బాధ్యుడనై యుందును. మీరేమాత్రము విచారపడ నలసిన పనిలేదు” అని రెడ్డిగారు ప్రత్యుత్తరమిచ్చిరి. అందరును ఆశ్చర్యపడిరి. " నీ కేమైన మతి తప్పినదా! పిచ్చివాడవైనావా- నీ వేమి మాట్లాడుచున్నావో ఆలోచించుకొన్నావా'! ఇంత గొప్ప బాధ్యతను నీవు నిర్వహింప జాలుదువా! బ్రిటిషు ఇండియాలోని పరిస్థితులను దిన దినము జరుగు ఆందోళసములను నీవు గమనించినావా? అని యెన్నియో ప్రశ్నా పరంపరలు మంత్రిగారును, అందరును, వీరిపై కురిపించినారు. అన్ని టికిని ఒకటే ప్రత్యుత్తరము - " నేను సంపూర్ణ బాధ్యత వహంచియే మాట్లాడుచున్నాను".

" ఏమైన ప్రమాదమైన ,

" నాతల సమర్పించు కొందును "